గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు.. సభాపతి దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్పీకర్‌కు స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఆదేశిస్తే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళల రక్షణకు దిశ చట్టం ఓ బలమైన కవచంగా పని చేస్తోందన్నారు. 'దిశ చట్టం' మహిళల చేతిలో పాశుపతాస్త్రంలా ఉందన్నారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చేందుకు వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి..
somu veerraju: ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై సీఎం వైఖరి ఏంటి?: సోము వీర్రాజు