ETV Bharat / city

'రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠం చేసేందుకు ప్రయోగాత్మక సర్వే' - రెవెన్యూ డిపార్డుమెంట్ న్యూస్

వచ్చే మే నాటికి రెవెన్యూ రికార్డులను సరిచేస్తామని ఆ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గుంటూరులో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, పేదల ఇళ్లకు భూ సమీకరణ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన... రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేస్తామన్నారు.

Revenue minister review on revenue records at guntur
రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠం చేసేందుకు ప్రయోగాత్మక సర్వే
author img

By

Published : Nov 29, 2019, 6:38 AM IST

రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠం చేసేందుకు ప్రయోగాత్మక సర్వే

వివాదాలకు తావులేకుండా వచ్చే మే నాటికి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ వెల్లడించారు. వచ్చే జులై నుంచి 3 నెలలపాటు జమాబందీ నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్​లో మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజుతో కలిసి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, ఇళ్ల నివేశన పట్టాలకు భూసమీకరణ అంశంపై మంత్రి బోస్‌ సమీక్ష నిర్వహించారు. భూయజమానుల హక్కులకు భరోసా కల్పించేలా రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేస్తామన్నారు. రెవెన్యూ సిబ్బందిపై పడుతున్న పని ఒత్తిడిని తగ్గిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భూవివాదాలకు తావులేకుండా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి ప్రయోగాత్మకంగా సర్వేను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :

మే 31 నుంచి సరికొత్త భూ రికార్డులు: ఉప ముఖ్యమంత్రి

AP_GNT_07_28_MINISTERS_REVIEW_ON_REVENUE_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: KESAVA RAO ( ) వచ్చే మే నాటికి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తామని.. వివాదాలకు తావులేకుండా స్వఛ్చీకరణ చేపడతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోస్ వెల్లడించారు. అనంతరం జులై నుంచి మూడు నెలలపాటు జమాబందీ నిర్వహించనున్నామన్నారు. భూ యజమానుల హక్కులకు భరోసా కల్పించేలా రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేయనున్నామని.. అదే సమయంలో రెవెన్యూ సిబ్బందిపైన పని ఒత్తిడిని తగ్గిస్తామని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్లో మరో ఇద్దరు మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజుతో కలిసి రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ, ఇళ్ల నివేశన పట్టాలకు భూ సమీకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భూవివాదాలకు తావులేకుండా సమగ్రసర్వే నిర్వహించనున్నామని... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి ప్రయోగాత్మకంగా సర్వేను చేపట్టనున్నామని చెప్పారు. సిబ్బంది సమస్య లేదని, గ్రామ సచివాలయ సిబ్బంది సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఉగాదినాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని గృహనిర్మాణ శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీరంగ నాథరాజు చెప్పారు. ప్రభుత్వభూమి లభ్యత లేనిచోట్ల రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టాలని సూచించారు.....BYTEs... BYTE: పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి BYTE: శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి BYTE: మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.