విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆస్తి అని... దాన్ని అమ్మడానికి మోదీ ఎవరని సీపీఐ నాయకులు ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ... గుంటూరులో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జి సెంటర్ అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి.. 32మంది ప్రాణ త్యాగ ఫలితంగా సాధించుకున్నామని గుర్తుచేశారు. కేంద్రం నిర్ణయాన్ని మార్చకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు
విశాఖలో..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని హెచ్చరించారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నగరవీధుల్లోకి వచ్చారు. వందల సంఖ్యలో కార్మికులు.. కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనలో తెదేపా పాల్గొని మద్దతు తెలిపింది.
ఇదీ చూడండి: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఈనెల 14న దిల్లీ వెళ్లనున్న రాష్ట్ర భాజపా నేతలు