గిరిజనులు, ఆదివాసీలకు అండగా నిలుస్తామని ఎస్టీ కమిషన్ సభ్యురాలు మాయా చింతామన్ తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో గిరిజన సంఘాల నేతల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. గిరిజనులపై జరుగుతున్నఅత్యాచారాలు, అన్యాయాలను ఆమె ఖండించారు. గిరిజన హక్కుల్ని కాపాడతామని తెలిపారు. దిల్లీలోని ఎస్టీ కమిషన్ కార్యాలయానికి 50 ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. పేద గిరిజనులకు ఆర్థికభారం పడకుండా వాటిపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు మాయా చింతామన్ చెప్పారు.
ఇవీ చదవండి...ఆ రైతు కుటుంబాలకు రూ.7 లక్షల సాయం: సీఎం