ETV Bharat / city

చిత్తూరులో అపహరణకు గురైన బాలుడు గుంటూరులో లభ్యం - చిత్తూరులో అపహరణకు గురైన బాలుడు గుంటూరులో లభ్యం

చిత్తూరు జిల్లాలో అపహరణకు గురైన బాలుడు గుంటూరులో లభ్యమయ్యాడు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా... పసికందును ఎత్తుకెళ్లిన మహిళని పోలీసులు గుర్తించారు. గుంటూరు శివారు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి.. విజయవాడ వెళ్తున్న బస్సులో పిల్లాడిని గుర్తించారు. బాబుతో పాటు ఉన్న పద్మ, వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు.

బాలుడు
బాలుడు
author img

By

Published : Mar 20, 2022, 5:25 AM IST

చిత్తూరులో అపహరణకు గురైన నాలుగు రోజుల వయసున్న బాలుడు గుంటూరులో లభ్యమయ్యాడు. చిత్తూరు జీజీహెచ్‌లో నాలుగు రోజుల క్రితం జన్మించిన పసికందును శనివారం తెల్లవారుజామున ఓ మహిళ అపహరించి తీసుకెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది, తల్లిదండుల ఫిర్యాదు మేరకు పోలీసులు... ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా... పసికందును ఎత్తుకెళ్లిన మహిళని గుర్తించారు. 3 బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలించారు. పిల్లాడిని అపహరించిన మహిళ... పద్మ అనే మరో మహిళకు బాబును అప్పగించి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పద్మ... వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి బాబును బస్సులో విశాఖ జిల్లా భీమిలికి తీసుకువెళ్తున్నట్లు నిర్ధరించుకుని... గుంటూరు సౌత్ డీఎస్పీకి సమాచారమిచ్చారు. దీంతో గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి.... నల్లపాడు, చేబ్రోలు పోలీసులను అప్రమత్తం చేశారు. నల్లపాడు పోలీసులు గుంటూరు శివారు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి.. విజయవాడ వెళ్తున్న బస్సులో పిల్లాడిని గుర్తించారు. బాబుతో పాటు ఉన్న పద్మ, వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. పసికందును గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చిత్తూరు నుంచి పోలీసుల బృందం రాగానే.. బాబును అప్పగిస్తామని... డీఎస్పీ ప్రశాంతి తెలిపారు.

ఇదీ చదవండి Infant Missing: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.