Power Cuts: కరెంటు కోతలను ఆగ్రహించిన గుంటూరు జిల్లా తెనాలి ప్రజలు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. చెంచుపేటలోని సబ్‌స్టేషన్‌లో పవర్ డిస్ట్రిబ్యూషన్ లారీ... కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలన చేతగాని సీఎం పదని నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. కరెంటు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. కరెంటు అందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసన కారులను చెదరగొట్టారు.
ప్రకాశం జిల్లా: విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముస్లింలు ధర్నా చేపట్టారు. అర్ధరాత్రి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. తమకు రంజాన్ నెల కావడంతో ఒక్కపొద్దులు ఉంటున్నామని ఇలా కరెంట్ కోతలు పెడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుమున తాము ఆహారం ఎలా తీసుకోవాలని ప్రశ్నించారు. విద్యుత్ కార్యాలయంలో కరెంట్ ఉండి.... తమకెందుకు తీశారన్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా మిక్సీలు కార్యాలయం వద్దకు తెచ్చుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎవరికైనా ఇలా అవసరం వస్తే విద్యుత్ కార్యాలయం వద్దకు తెచ్చుకొని పట్టుకోవచ్చని వారు సూచించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ పర్యటన దృష్ట్యా.. తెదేపా నేతల గృహ నిర్బంధం