గుంటూరు కేవీపీ కాలనీలోని ఓ బార్లో.. గతనెల 22న జరిగిన హత్య కేసును నగరంపాలెం పోలీసులు ఛేదించారు. 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని.. వారిలో మైనర్ బాలుడు ఉన్నాడని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు కర్రలు, రెండు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చెడు వ్యసనాలు, ఆధిపత్య పోరు కారణంగానే బాధితుడిని హత్య చేసినట్లు వివరించారు. వారిపై రౌడీ షీట్ తెరుస్తున్నట్లు చెప్పారు.
నగరంలోని కేవీపీ కాలనీలో నివాసముండే బత్తుల గోపీనాథ్ చెడు వ్యసనాలకు బానిసై.. గంజాయి, మాదకద్రవ్యాలు, దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అదే కాలనీలో ఉంటున్న కొంతమంది యువకులతో గోపీనాథ్‌కు స్నేహం కుదిరింది. ఈ క్రమంలో మిత్రుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈనెల 22న గోపీనాథ్ కేవీపీ కాలనీలో ఉన్న ఓ బార్కి మద్యం సేవించడానికి వెళ్లాడు. రూ. 100 ఇవ్వాలంటూ స్నేహితులకు హుకుం జారీ చేశాడు. ప్రతిసారీ బెదిరించి డబ్బలు, గంజాయి తీసుకురమ్మని వేధిస్తున్నాడని భావించిన మిత్రులు.. గోపీనాథ్‌ని హతమార్చడానికి నిశ్చయించుకున్నారు. మరికొంతమందితో కలిసి కర్రలు, వేట కొడవళ్లతో దాడి చేసి బాధితుడిని హత్యచేశారు అని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: