ETV Bharat / city

Lokesh Tour in Guntur: మా పింఛను తొలగించారు.. లోకేశ్​కు విన్నవించిన బాధితులు - KVS Aided School Students

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh Visit in Guntur district) పర్యటించారు. చినకాకాని గ్రామంలోని హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన పర్యటన ప్రారంభించారు.

Lokesh Tour in Guntur
గుంటూరు జిల్లాలో లోకేశ్ పర్యటన
author img

By

Published : Nov 25, 2021, 9:24 PM IST

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh Tour in Guntur district) పర్యటించారు. మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలోని హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన పర్యటన ప్రారంభించారు.

గ్రామంలో ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వైకాపాని గెలిపిస్తే 3 వేలు పింఛను ఇస్తామని, ఇప్పుడు అకారణంగా తొలగించారంటూ బాధితులు విన్నవించారు. విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని, రకరకాల కారణాలు చూపి పెన్షన్, రేషన్ కార్డు, సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేస్తున్నారంటూ వాపోయారు.

ఇసుక దొరకకపోవడం వల్ల పనులు దొరకడం కష్టంగా మారిందని భవన నిర్మాణ కార్మికులు లోకేశ్ కు వివరించారు. లోకేశ్ వస్తే ఇళ్లు తొలగిస్తారని ప్రచారం చేసిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే.. ఇప్పుడు ద‌గ్గరుండి ఇళ్లు కూల‌గొట్టిస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెదేపా పోరాడుతోంద‌ని భ‌రోసా ఇచ్చారు.

దుగ్గిరాల మండలం చిలువూరులో నారా లోకేశ్‌ పర్యటించారు. కేవీఎస్ ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థులతో (KVS Aided School Students)ఆయన మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ జీవోలు తెచ్చారని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ.. పేద విద్యార్థుల పాలిట వరమని లోకేశ్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : cannabis seize:కాజా టోల్ గేట్ వద్ద 370 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.