ETV Bharat / city

Lemon Price Hike : పెరిగిన నిమ్మకాయల ధరలు.. లాభాల దిశగా రైతులు.. - తెనాలిలో నిమ్మ పంట ధరలు

Lemon Price Hike: నిమ్మకాయలు మంచి రేటు పలుకుతున్నాయి. తెనాలి మార్కెట్లో నాణ్యమైన కేజీ నిమ్మకాయలకు 190 రూపాయల వరకు ధర వస్తోంది. గతేడాది తక్కువ ధరలతో నష్టపోయన నిమ్మ రైతులు ఈసారి లాభాలకు అమ్ముకుంటున్నారు. ఈసారి దిగుబడులు తగ్గినప్పటికీ.. ధరల ఊపుతో లాభాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.

Lemon Price Hike
Lemon Price Hike
author img

By

Published : Apr 7, 2022, 6:53 PM IST

Lemon Price Hike in Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో నిమ్మ పంట విస్తారంగా సాగువుతోంది. పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలోనూ నిమ్మ తోటలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల సరుకు తెనాలి మార్కెట్ యార్డుకు వెళ్తుంది. ఈసారి నిమ్మకాయలకు మంచి ధర లభిస్తుండటం.. రైతుల్లో ఆనందం నింపుతోంది. మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి క్వింటా 10వేల రూపాయలకు తగ్గలేదు. ప్రస్తుతం క్వింటా 15వేల నుంచి 19వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. నాణ్యమైన నిమ్మకాయలకు మంచి ధర లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.

పెరిగిన నిమ్మకాయల ధరలు...లాభాల దిశగా రైతులు...

ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి సరుకు ఎక్కువగా వస్తోంది. తెనాలి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోతలు మొదలవుతున్నాయి. ధర ఆశాజనకంగా ఉండటంతో పండిన కాయలు పండినట్లే మార్కెట్‌కు తెస్తున్నారు. గతేడాది క్వింటాల్‌కు 5వేల రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో... నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచే నిమ్మకు మంచి డిమాండ్ ఏర్పడటంతో ధర పెరిగుతూ వస్తోంది.

కరోనా కారణంగా రెండేళ్లుగా నిమ్మకాయల ఎగుమతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అలాంటివేమీ లేకపోవటం కూడా రైతులకు కలిసొచ్చింది. ధర బాగున్నప్పటికీ నిమ్మ దిగుబడి తగ్గిపోవడంతో రైతుల కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే ధర ఎక్కువ ఉండటం కొంతవరకు కలిసివస్తుందని అంటున్నారు.

' నిమ్మకాయలను మార్కెట్ కు తెచ్చిన రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుంది. నిమ్మకాయల ధర పెరగటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. వాతావరణం కారణంగా కాపు తక్కువ ఉంది. ఇలా నిమ్మకాయల ధరలుండటం మాకి ఆశాజనకంగా ఉంది. ' -నిమ్మ రైతు

' నిమ్మకాయల రేటు ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. కాపు ఈ ఏడాది తక్కువగా ఉండటంతో ధర పలుకుతున్నాయి. ఆశాజనకంగా రేటు ఉన్నప్పటికీ రైతుకి గిట్టుబాటు కష్టమవుతుంది. కాపు బాగా కాసిన వాళ్లకి లాభాలొస్తాయి. కానీ ఎనభై శాతం మందికి లాభాలు రాలేదు. తరువాత కూడా ఇలాగే ఉంటే కాపు తక్కవైనా ఒడ్డున పడతామని ఆశగా ఉంది.' - నిమ్మ రైతు

'తెగుళ్ల కారణంగా తోటల్లో కాయలు లేవు. కానీ మార్కెట్లో ధరలు మాత్రం బాగున్నాయి. ఇలా తోటలు పోవడం నేను ఇప్పుడే చూస్తున్నాను.' -నిమ్మ రైతు

నిమ్మకాయలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మార్కెట్‌కు వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. మన నిమ్మకాయలకు ఆ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉందని అంటున్నారు.

'తెనాలి ప్రాంతంలో గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం కాపు తక్కువగా ఉన్నాయి. జనవరి కురిసిన వర్షాలకు పూతరాలిపోయి...కాయలు అందుబాటులో లేవు. ఇంకా పూర్తి స్థాయిలో కాయలు అందుబాటులోకి రావడానికి నెల,నెలన్నర సమయం పడుతుంది. ప్రస్తుతం మార్కెట్ కి ప్రకాశం జిల్లా నుంచి కాయలు వస్తున్నాయి. అందువల్ల ధరలు రైతాంగానికి అందుబాటులో ఉన్నా సరుకు లేదు. ఇదే ధరలు ఈ సీజన్ ఆఖరి వరకూ కొనసాగితే రైతులకి ఎంతో కొంత వెసలుబాటు కలుగుతుంది.' -జె.వి.సుబ్బారావు, తెనాలి మార్కెట్ యార్డు కార్యదర్శి

ఇవే ధరలు కొనసాగితే మంచి లాభాలు వస్తాయని రైతులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. వృద్ధురాలి వైద్యానికి ముందుకొచ్చిన ఆర్టీసీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.