తనను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నూజివీడులో 18 ఎకరాల వెంకటాచలం భూములను కన్నా లక్ష్మీనారాయణ కబ్జా చేశారని.... దీన్ని త్వరలో బయట పెడతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలకు ఆయన స్పందించారు. ఇలాంటి బెదిరింపులు చాలా ఏళ్ల నుంచి చూస్తున్నానని... ఎవరూ తనను ఏమీ చేయలేరని కన్నా అన్నారు. దేవాలయ ఆస్తులకు సంబధించి తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని... ప్రభుత్వానికి, మంత్రులకు దమ్ముంటే వాటికి నేరుగా సమాధానం ఇవ్వాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి అర్థం కావటం కోసం ఇంగ్లీష్లోనే లేఖ రాశానని వ్యాఖ్యానించారు. తితిదే ఆస్తుల అమ్మకాలకు సంబంధించి ఇప్పటి వరకూ జరిపిన ప్రక్రియను రద్దు చేయాలని, అన్ని రకాల ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
నన్ను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు: కన్నా - మంత్రి వెల్లంపల్లికి కన్నా లక్ష్మీ నారాయణ కౌంటర్
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నూజివీడులో 18 ఎకరాల భూమిని కన్నా కబ్జా చేశారని మంత్రి వెల్లంపల్లి ఆరోపణలు చేశారు. దీనికి కన్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.