లాక్డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులను రద్దుచేయాలని.. ప్రభుత్వ స్థలాల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రిలే దీక్షలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి.. అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలను విద్యుత్ ఛార్జీలను పెంచి కష్టాల్లోకి నెట్టారని జనసేన నాయకుడు కిరణ్ అన్నారు. 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలన్నారు. గుంటూరులోని పీవీకే మార్కెట్ అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![janasena relay protest in guntur against increasing of current charges in lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-gnt-21-22-janasena-rile-diksha-av-ap10169_22052020122301_2205f_1590130381_899.jpg)
ఇదీ చదవండి :