ETV Bharat / city

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. ప్రాంగణానికి చేరుతున్న శ్రేణులు - జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ

Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ కాసేపట్లో మొదలుకానుంది. ఈ సభ కోసం ఇప్పటంలో సర్వం సిద్ధమయ్యాయి. సభా ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కల్యాణ్​ అభిమానులు, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

janasena party celebrations at ippatam
సందడిగా మారిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభా ప్రాంగణం
author img

By

Published : Mar 14, 2022, 2:49 PM IST

Janasena Formation Day: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా ఇప్పటంలో సందడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు.

సందడిగా మారిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభా ప్రాంగణం

కృష్ణా జిల్లా అవనిగడ్డ, కోడూరు నుంచి కార్లతో ర్యాలీగా బయలుదేరారు. మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, నాగాయలంక నుంచి రెండేసి బస్సుల్లో జనసేన కార్యకర్తలు తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం నుంచి జనసేన నేతలంతా కార్లు, బస్సుల్లో బయలుదేరారు. అభిమానులు, కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది.

ఇదీ చదవండి: Power Cut: 108 కార్యాలయానికి పవర్​ కట్​..ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.