ETV Bharat / city

గుంటూరు మిర్చి యార్డు మూసివేత పొడిగింపు..!

author img

By

Published : Jul 3, 2020, 4:29 PM IST

గుంటూరు మిర్చియార్డు మూసివేతని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. యార్డులో పనిచేస్తున్న వారు కరోనా బారినపడడంతో అధికారులు ముందు జాగ్రత్తగా యార్డు సెలవులు పొడిగిస్తారని సమాచారం. వ్యాపార సంఘాలు, కమిషన్​ ఏజెంట్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు. పండించిన పంటంతా రైతులు శీతల గోదాముల్లో నిల్వచేశారు. యార్డు సెలవులు పొడిగిస్తే మరికొన్ని రోజులు పంట నిల్వఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.

గుంటూరు మిర్చి యార్డు మూసివేత పొడిగింపు..!
గుంటూరు మిర్చి యార్డు మూసివేత పొడిగింపు..!

గుంటూరు మిర్చియార్డు మూసివేత మరికొద్ది రోజులు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. యార్డులో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మందికి కరోనా సోకటంతో యార్డు సెలవులు పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు కరోనా సోకడంతో జూన్ 25న మిర్చియార్డును మూసివేశారు. జులై 6వ తేదీన తెరుస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. యార్డులో వైరస్ నియంత్రణ కోసం పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అయితే గత రెండు రోజులుగా చేసిన పరీక్షల్లో యార్డులో పనిచేస్తున్న మరో 20 మందికి కరోనా నిర్థరణ అయ్యింది. వీరిలో కమిషన్ ఏజెంట్లు, గుమస్తాలు, హమాలీలు ఉన్నారు.

  • గోదాముల వద్దే అమ్మకాలు

కేసులు పెరగడంతో.. యార్డు ఇప్పుడే తెరవటం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేలాది మంది వచ్చి వెళ్లే మార్కెట్లో వైరస్ విజృంభిస్తే కేసులు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఆ కారణంతో యార్డు తెరవటంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రైతులు పండించిన పంటంతా శీతల గోదాముల్లోనే ఉంది. గోదాముల నుంచే పంట అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించటంపైనా అధికారులు దృష్టి సారించారు. తద్వారా రైతులు నష్టపోకుండా చూడాలని అధికారుల ఆలోచన. వ్యాపార సంఘాలు, కమిషన్ ఏజెంట్లతో చర్చించి మిర్చియార్డు తెరవటంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : రఘురామకృష్ణరాజుపై లోక్​సభ స్పీకర్​కు వైకాపా ఫిర్యాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.