రాజకీయ లబ్ధి కోసం గుంటూరు జిన్నా టవర్ అంశాన్ని భాజపా నేతలు తెరపైకి తీసుకొచ్చారని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. జిన్నా టవర్ ఒక చారిత్రక చిహ్నమని తెలిపారు. కులమతాల మధ్య సహృద్భావాన్ని పెంచే ఇలాంటి కట్టడాలను పరిరక్షించడం నగరపాలక సంస్థ బాధ్యత అని వివరించారు. జిన్నా టవర్ చుట్టూ చేపట్టిన కంచె నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జిన్నా టవర్ పేరు మార్చాలని భాజపా నేతలు చేస్తున్న డిమాండ్లో అర్ధం లేదని మనోహర్ నాయుడు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి.