కరోనా విపత్కర పరిస్థితుల్లో మత రాజకీయాలు మానుకోవాలని.. గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సూచించారు. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు కష్టపడుతుంటే.. దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'ఆర్మీ' పేపర్ లీక్: సికింద్రాబాద్ కల్నలే సూత్రధారి!
ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వానికి సహకరించకపోగా.. విమర్శలు చేయడం తగదని మనోహర్ నాయుడు హితవు పలికారు. విజయవాడలో 40 ఆలయాల్ని కూల్చివేసినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కొవిడ్ విస్తృత వ్యాప్తివేళ.. దేవాలయాల ఫంక్షన్ హాల్స్‌లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కపిల జాతి ఆవుకు పుంగనూరు దూడ జననం