ETV Bharat / city

father killed son: కోడలితో వివాహేతర సంబంధం.. కొడుకును హతమార్చిన తండ్రి

ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కోడలితోనే అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి.. కన్న కొడుకునే హత్య చేశాడు. అర్ధరాత్రి దాటాకా మారణాయుధాలతో అతి కిరాతంగా హతమార్చాడు. ఈ దారుణాన్ని అతని కొడుకు చూడడంతో విషయం బయటపడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

father killed son
father killed son
author img

By

Published : Aug 3, 2021, 9:54 AM IST

సమాజంలో బంధాలు మంటగలిసిపోతున్నాయి. వావి వరసలు మరిచి ప్రవర్తించడమే గాకుండా... స్వల్పకాల సుఖాల కోసం ప్రాణాలను సైతం తీస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డలైనా... కన్నవాళ్లనైనా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

కోడలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించాడా తండ్రి. ఆమెతో కలిసి కుమారుడిని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అద్దంకి సీఐ రాజేష్‌, ఎస్సై వి.శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. వీరి కుమారుడు లక్ష్మయ్య (35)కు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతకు పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. మరియమ్మ ముప్పై ఏళ్ల క్రితమే చనిపోయారు. లక్ష్మయ్య మద్యానికి బానిసై ఆ మత్తులో ఉండేవాడు. ఈ క్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారు.

అనుకున్న పథకం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక.. గాఢనిద్రలో ఉన్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణం మృతుడి పెద్ద కుమారుడు చూడడం వల్ల విషయం బహిర్గతమైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: గుంటూరులో ఇద్దరు మహిళలపై కత్తిపీటతో వ్యక్తి దాడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.