గుంటూరు జిల్లాలో మరికొన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇవన్నీ కాంటాక్ట్ కేసులే తప్ప... కొత్తవి కావని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారితో సమస్య తక్కువగానే ఉందన్న ఆయన... దిల్లీ నుంచి వచ్చిన వారు, కలిసిన వారికి విస్తృతంగా పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై 47 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఇవీ చదవండి: 'దేశంలో సామాజిక అత్యవసర పరిస్థితి'