డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను గందరగోళానికి గురి చేయకుండా...పరీక్షలు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి పరీక్షలు రద్దు చేశామని, ఉంటాయని, మళ్లీ చెబుతామని ఇలా అయోమయానికి గురిచేయటం సరికాదన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పరీక్షలు రద్దు చేయడం మంచిదని సూచించారు. సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాలూ వివిధ పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇదీ చదవండి : ట్రిపుల్ ఐటీల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం: మంత్రి సురేశ్