గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. తాజాగా.. నల్లపాడు, కేవీపీ కాలనీ, మద్దిరాల కాలనీ, లక్ష్మీపురం, దాచేపల్లి, నరసరావుపేటలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
మొత్తం కేసుల సంఖ్య 583కు చేరింది. గుంటూరు నగరంలో 222.. నరసరావుపేటలో 202 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.
ఇదీ చూడండి: