మీడియాపై ఆంక్షలు విధిస్తూ గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకున్నారని... అయితే సీఎం జగన్ మాత్రం అహంభావంతో ముందుకెళ్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైఎస్ వెనక్కి తీసుకున్న జీవోకు మరింత పదునుపెట్టి జగన్ కేబినెట్‌లో ప్రవేశపెట్టారని ఆరోపించారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విజ్ఞతతో రాజశేఖర్ రెడ్డి జీవోను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. 5 నెలల కాలంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసి.. ఇప్పుడు మీడియాను నియంత్రించాలనుకోవటం తగదని హెచ్చరించారు. వైఎస్ హయాంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసి అనంతరం ఉపసంహరించుకున్న వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. ఈ అంశంపై అప్పటి సీఎం వైఎస్సార్ మాట్లాడటాన్ని సైతం వీడియో రూపంలో ప్రదర్శించారు. నెల్లూరులో ఓ విలేఖరిని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దానికి సంబంధించిన ఆడియో టేప్‌ను వినిపించారు. ఓ హోంగార్డును మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెదిరించారని మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యేలు వస్తే డీజీపీ ఆఫీస్‌లో ఉండరనీ... వైకాపా వాళ్లు వస్తుంటే ఎదురువెళ్లి స్వాగతం పలుకుతారని చంద్రబాబు ఆరోపించారు. తనకు నోటీసులు ఇస్తానని డీజీపీ అనటాన్ని తప్పుబట్టిన చంద్రబాబు... ఎన్ని ఇస్తారో ఇవ్వండి చూస్తానని సవాల్ చేశారు.
"వైఎస్ వెనక్కి తీసుకున్న జీవోకు.. జగన్ పదును" - chandra babu over media sanctions
పత్రికా స్వేచ్ఛను బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలనుకోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విజ్ఞతతో రాజశేఖర్ రెడ్డి ఎందుకు జీవోను ఉపసంహరించుకున్నారో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.