ETV Bharat / city

అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: చంద్రబాబు - chandrababu fire on cid

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ఇతరులకు షేర్‌ చేస్తున్నారనే అభియోగంపై గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన వృద్ధుడు చేరెడ్డి జనార్దన్​ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోని నోటీసులు ఇవ్వడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరెడ్డి జనార్దన్​కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

CBN_Meet_Social_Activist
చేరెడ్డి జనార్దన్​కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
author img

By

Published : Aug 11, 2021, 11:54 AM IST

గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన వృద్ధుడు చేరెడ్డి జనార్దన్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ఇతరులకు షేర్‌ చేస్తున్నారనే అభియోగంపై చేరెడ్డి జనార్దన్‌ను ఇటీవల సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి నోటీసులు అందజేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు జనార్దన్​ను కలిసి పరామర్శించారు.

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబును కలిసిన జనార్దన్ అధినేతకు జరిగిన పరిణామాలు వివరించారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని జనార్దన్​కు ధైర్యం చెప్పిన చంద్రబాబు, అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎండగట్టాలని సూచించారు.

ఇదీ చదవండి:

ఈ బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.