పోలీసులు ఆత్మ గౌరవం దెబ్బతీసేలా తెదేపా నేతలు వ్యవరించడం మంచిదికాదని... వారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారులు జాతకం అంత తమ దగ్గర ఉందని బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబుపైనా కేసు నమోదు చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతకు గురై... మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు... గాంధీజీ సంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండీ... ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా..?