ప్రచారం ఘనం చేతలు శూన్యం అన్నట్లుగా వైకాపా సర్కారు బడ్జెట్ ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు వైకాపా స్టిక్కర్లు వేశారని ఆయన విమర్శించారు.
ఖజానా ఖాళీ చేసి అప్పులు చేస్తూ... ఆస్తులు అమ్మేస్తున్నారని ఆరోపించారు. పరిపాలనపై అవగాహన లేక అన్ని విషయాల్లో కోర్టు మొట్టికాయలు తింటున్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని రివర్స్ గేర్లో నడిపిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.