నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్ధతుగా.. ఆ సంఘం నేతలు గుంటూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందూ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 8న జరగనున్న దేశవ్యాప్త బంద్‌లో.. బీసీలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శంకరరావు పిలుపునిచ్చారు. నేల తల్లిని నమ్ముకుని దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల సమస్యలపై.. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: