గుంటూరు గాంధీ పార్క్ ఎదుట ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో తెల్లవారుజామున చోరీ జరిగింది. తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బ్యాంక్ లోకి ప్రవేశించి రూ. 23 లక్షల అపహరించినట్లు బ్యాంక్ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: పెనమకూరు స్టేట్ బ్యాంక్లో చోరీ.. ఐదు గంటల్లో ఛేదించిన పోలీసులు