గుంటూరులో అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నూతన భవనాన్ని, పింగళి వెంగయ్య విగ్రహాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో అనాథ మృతదేహాలకు, కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం అభినందనీయమని కొనియాడారు. సాయం చేయాలనే సంకల్పంతో ట్రస్ట్ ఏర్పాటు చేశామని.. ప్రజలు సహకరించాలని కోరారు ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాన ప్రసున్నాంబ బాబా.
26 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో దహన సంస్కారాలకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోతే.. తామే అంత్యక్రియలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు స్థలాన్ని కేటాయిస్తే అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమాన్ని మరింత పెంచుతామని, అనాథలకు, నిరాశ్రయులకు సేవలు అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్