గుంటూరు లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 293వ పాలకమండలి సమావేశం జరిగింది. వైస్-ఛాన్సులర్ మధుసూధన రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బోధన, పరిశోధన, విస్తరణ, మౌలిక వసతుల ప్రగతిని సమీక్షించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో సచివాలయం, ఇతర విశ్వవిద్యాలయం విభాగాల అధికారులు నివాసం ఏర్పరుచుకున్నారు. వారికి ఇచ్చే 30శాతం ఇంటి అద్దె భత్యాన్ని రూ.20వేలు పరిమితికి లోబడి ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందికి 27శాతం మధ్యంతర భృతిని జులై ఒకటి నుంచి ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షల నిధుల మంజూరుకు పాలకమండలిలో అంగీకారం తెలిపారు.
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో 293వ పాలకమండలి సమావేశం - ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం
గుంటూరు లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్-ఛాన్సులర్ మధుసూధన రెడ్డి అధ్యక్షతన 293వ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిధిలో బోధన, పరిశోధన, విస్తరణ, మౌలిక వసతుల ప్రగతిని సమీక్షించారు.
![ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో 293వ పాలకమండలి సమావేశం ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో 293వ పాలకమండలి సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7675442-815-7675442-1592499215483.jpg?imwidth=3840)