ETV Bharat / city

'నా భార్య అతనే కావాలంటోంది'... పోలీసులను ఆశ్రయించిన భర్త..! - అక్రమ సంబంధం వార్తలు

వివాహేతర సంబంధం దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. తప్పు దారిన పడొద్దని మందలించినందుకు భర్తను వదిలేసి వెళ్లిపోయింది భార్య. కాపురానికి రమ్మని బతిమలాడుతున్న భార్య రాకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

illegal affair
illegal affair
author img

By

Published : Oct 6, 2020, 4:41 AM IST

తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వదిలి వెళ్లిపోయిందని.... ఆమెను తనకు అప్పజెప్పాలంటూ ఓ వ్యక్తి గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న అతనిని చట్టపరంగా శిక్షించాలని బాధితుడు కోరాడు.

గుంటూరు దేవనగర్​కి చెందిన చందులాల్ నాలుగు సంవత్సరాల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. చందులాల్ వడ్రంగి పనులు చేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిసున్నాడు. అతని భార్యకు ఆమె స్నేహితురాలి ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో ఈమె తరచూ ఫోన్​లు మాట్లాడుతూ, చాటింగ్​ చేస్తూ ఉండేదని చందూలాల్ వెల్లడించారు. అనుమానంతో తన భార్య ఫోన్ తీసుకుని పరిశీలించగా జస్వంత్ అనే వ్యక్తి ఫోటోలు, మెసేజ్​లు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. ఇది మంచి పద్ధతి కాదని మందలించటంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టినింటికి వెళ్లిందని.... అత్తారింటికి వెళ్లి కాపురానికి రమ్మంటే రావటం లేదని చెప్పాడు. తన భార్యకు ఆమె తల్లి కూడా మద్దతు పలుకుతోందని వాపోయాడు.

నా భార్య జస్వంత్ అనే వ్యక్తితో చాటింగ్ చేసేది. అతను పంపిన సొమ్ముతో బంగారపు ఉంగరాలు కూడా కొనుగోలు చేసింది. ఇది సరైన పద్ధతి కాదని నేను మందలిస్తే... నాకు అతనే కావాలి నువ్వు వద్దు అని చెబుతోంది. 9 నెలల క్రితమే మా అమ్మ చనిపోయింది. నన్ను ఒంటరి వాడిని చేయకూ...నాతో వచ్చేయ్ అని చెప్పినా నా భార్య రావటం లేదు. 10 రోజలు నుంచి వాళ్ల అమ్మ దగ్గరే ఉంటోంది. నా అత్త కూడా ఆమెకే మద్దతు తెలుపుతోంది- చందూలాల్, భాధితుడు

తనకు తగిన న్యాయం చేయాలని సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు బాధితుడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.