ETV Bharat / city

రిజిస్ట్రేషన్‌శాఖలో గోప్యంగా విచారణ..మరింత లోతుగా సీబీఐ పరిశీలనలు...

author img

By

Published : Mar 17, 2022, 9:01 PM IST

Confidential CBI inquiry : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డుల మాయంపై కొన్ని నెలల కిందట విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు వారం రోజులపాటు తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Tadepalligudem registration office
Tadepalligudem registration office

Confidential CBI inquiry : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డుల మాయంపై కొన్ని నెలల కిందట విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు వారం రోజులపాటు తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా సీబీఐ నేరుగా తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై పరిశోధన చేయడం జిల్లాలో ఆ శాఖకు పెద్దకుదుపు. 2019లో ఒక వ్యాపార సంస్థ రూ.కోటి ఆస్తికి తమ సంస్థ ఉద్యోగులను బినామీలుగా చేసి రూ.5 కోట్లగా ఎక్కువ ఖరీదుతో దస్తావేజులు సృష్టించి బ్యాంకులను మోసం చేసిన కేసు వెలుగుచూసింది.

దీంతో ఈ కేసును సీబీఐ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. యూనియన్‌ బ్యాంకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభమైంది. ఐదు డాక్యుమెంట్లుగా చేసి ఆస్తి విలువను రూ.5 కోట్లకు పెంచి రిజిస్ట్రేషన్‌ చేసిన విషయంపై రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు కూడా గోప్యంగా శాఖాపరమైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్‌ లేనందున విజయవాడ రిజిస్ట్రార్‌ ఉషా విజయలక్ష్మి దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు దస్త్రాల పరిశీలన చేయనున్నట్లు తెలియవచ్చింది. సీబీఐ కూడా తాడేపల్లిగూడెంలో ఆ సంస్థకు చెందిన కార్యాలయంలో పరిశీలనలు చేసినట్లు సమాచారం. పట్టణానికి చెందిన ప్రముఖులు ఈ కేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : Nandigama RDO office: ఇకపై ఆర్డీవో కార్యాలయంగా తహశీల్దార్​ ఆఫీస్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.