ETV Bharat / city

తెలంగాణ : రైల్వే అధికారులకు డ్రైవర్​గా ఉద్యోగాలంటూ మోసం..

విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడ్డాడు. అమాయకుల వద్ద తాను రైల్వే ఉద్యోగిని అని నమ్మిస్తాడు. రైల్వే లోకో పైలెట్ దుస్తులు వేసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో, బస్టాప్​ల సమీపంలో హుందాగా తిరుగుతాడు. రైల్వే అధికారులకు డ్రైవర్​గా ఉద్యోగం ఇప్పిస్తానని క్యాబ్ డ్రైవర్లలో ఆశలు రేకెత్తిస్తాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి.. ముందస్తుగా డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇలా మోసాలకు పాల్పడుతున్న జ్యోతిశివ అనే వ్యక్తిని తెలంగాణలో జీఆర్​పీ పోలీసులు అరెస్ట్ చేశారు.

cheating-in-the-name-of-railway-jobs-one-person-arrested-by-grp-police-in-secunderbad
క్యాబ్ డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న తెలంగాణ పోలీసులు
author img

By

Published : Oct 9, 2020, 3:04 PM IST

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని క్యాబ్ డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్న జ్యోతిశివ అనే వ్యక్తిని తెలంగాణలో జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.1.80 లక్షల నగదు, విలువైన సెల్​ఫోన్లు, లోకో పైలెట్ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగయ్య గూడెం ప్రాంతానికి చెందిన జ్యోతిశివ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. రైల్వే స్టేషన్​, బస్​స్టాప్​ల వద్ద లోకో పైలెట్ దుస్తులు ధరించి కార్లలో పయనించేవాడు. రైల్వే అధికారుల వద్ద డ్రైవర్​గా ఉద్యోగం ఇప్పిస్తానని.. మంచి పారితోషికం లభిస్తుందని వారిని మాయ మాటలతో నమ్మించేవాడు.

విలాసవంతమైన జీవితాన్ని గడపడం జ్యోతిశివ అలవాటు చేసుకున్నాడని.. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ల వద్ద పలువురు క్యాబ్ డ్రైవర్ల నుంచి అతను డబ్బులు వసూలు చేశాడని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు.

ఏపీలోనూ గతంలో పలువురిని మోసం చేసినట్లు కేసులు ఉన్నాయని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

నకిలీ కరెన్సీకి ఆశపడితే కత్తులతో బెదిరించి దోచేశారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.