పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాగంటి బాబు కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో ఏలూరులో వెళ్లిన ఆయన.. ఇటీవల మరణించిన మాగంటి బాబు కుమారుడు రాంజీ సంస్మరణ సభలో పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు రాంజీ మరణం బాధాకరమని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలకు మాగంటి కుటుంబం ఎన్నో సేవలందించిందని.. వారికి అందరూ అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.
అనంతరం.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లిలో ఇటీవల మృతి చెందిన.. పశ్చిమగోదావరి చింతలపూడి ఇంఛార్జ్ కర్రా రాజారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కర్రా రాజారావు పశ్చిమ గోదావరి జిల్లాకు తీరని లోటని చంద్రబాబు అన్నారు. చింతలపూడి నియజకవర్గంలో తెదేపాను బలోపేతం చేయడంలో రాజారావు కీలక భూమిక పోషించారని అన్నారు. తెదేపా గన్నవరం ఇంఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: