కోవిడ్ కారణంగా మూతపడిన అటవీశాఖకు చెందిన అన్ని జంతు ప్రదర్శనశాలలు, నగరవనాలు, ఎకో టూరిజం పార్కులు వెంటనే పునఃప్రారంభించాలని రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఎన్.ప్రతీప్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు, కంబాలకొండలోని ఎకో టూరిజం పార్కు, నగరవనాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీబీఈటీ సెంటర్స్‌ను కేంద్రం నిబంధనల మేరకు తిరిగి ప్రారంభించాలని డీఎఫ్‌వోలను ఆదేశించారు.
రాష్ట్రంలో నగరవనాలు తిరిగి ప్రారంభించే సమయంలో సందర్శకులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అటవీశాఖ సూచించింది. అదేవిధంగా సిబ్బంది కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. కొవిడ్ కారణంగా గతంలో మూసివేసిన ఈ ప్రాంతాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఆదేశాల మేరకు పునఃప్రారంభిస్తున్నట్లు అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఎన్.ప్రతీప్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి