Sharmila: తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వైతెపా జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని ఆమె ఆకాంక్షించారు. నేలకొండపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాలేరు నుంచి పోటీచేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని.. అందుకే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.
'ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేయాలనేది ప్రజల కోరిక. ప్రజల కోరిక మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తా. వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి. చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ కోసం పని చేద్దాం. పాలేరు నియోజకవర్గం దిశా - నిర్దేశం కావాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి.'-షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇవీ చదవండి: