'దిశ' చట్టం పరిశీలన దశలోనే ఉందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ చట్టం కేంద్ర పరిశీలనలో ఉండగా.. దానికి సంబంధించిన ప్రశ్నలను వైకాపా ఎంపీలు కేంద్రాన్ని అడిగారు. ఈ ఏడాది జనవరిలో బిల్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బిల్లులను.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఈ బిల్లును సంబంధిత మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
'జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ-వాచ్ తీసుకొస్తే కోర్టును ఆశ్రయించండి'