వైకాపా సర్కార్ ఎన్నికల హామీ అమల్లో భాగంగా రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేల రూపాయల చొప్పున భృతి ఇవ్వడంపై రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జనవరి 1 నుంచి నెలకు 5 వేల చొప్పున భృతి అందిస్తామంటూ విధివిధానాలు, అర్హతలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో రాష్ట్రంలో 61 వేల మంది న్యాయవాదులు నమోదై ఉన్నారు. ఏటా 1500 మంది కొత్త న్యాయవాదులు.. బార్ కౌన్సిల్ లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నట్టు... న్యాయశాఖ అంచనా వేసింది.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
- జూనియర్‌న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు
- జనవరి 1 నుంచి నెలకు రూ.5 వేలు అందజేత
- ఏపీ బార్ కౌన్సిల్‌లో 61 వేల మంది న్యాయవాదులు
- కొత్తగా బార్‌కౌన్సిల్‌లో ఏటా 1500 మంది పేర్లు
- 3 ఏళ్లు లేదా అంతకులోపు న్యాయవాదవృత్తి ప్రాక్టీసు తప్పనిసరి
- ఎన్‌రౌల్‌మెంట్‌ధ్రువపత్రం ఆధారంగా మొదటి మూడేళ్లు చెల్లింపు
- మూడేళ్లకు ముందు బార్ కౌన్సిల్ లో నమోదు తప్పనిసరి
- దరఖాస్తుదారులు కనీసం న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉండాలి
- 2016 తర్వాత న్యాయశాస్త్ర పట్టా పొందినవారే అర్హులు
- న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు చేయని వారు అనర్హులు
- కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలున్నా పథకం వర్తించదు
- 35 ఏళ్లు దాటితే పథకం వర్తించదని స్పష్టీకరణ
- ysr law nestam.ap.gov.inలో దరఖాస్తుల స్వీకరణ
ఇదీ చదవండి: గోదావరి-కృష్ణా అనుసంధానం@60 వేల కోట్లు!