ETV Bharat / city

మహిళలకు అండగా వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం - రాష్ట్రంలో మహిళలకు వైఎస్సార్ చేయూత ప్రారంభం

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళల్లో సాధికారత సాధ్యం అవుతుందని... మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించారని పలువురు వైకాపా నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు.

ysr cheyutha for women has been launched throughout the state
వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం
author img

By

Published : Aug 13, 2020, 7:27 AM IST

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళల్లో సాధికారత సాధ్యం అవుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గున అన్నారు. అరకులోయలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని సీఎం జగన్ మహిళలకు ఈ విధంగా ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నగదుని వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టి కుటుంబాన్ని ముందుకు నడిపించాలని ఆయన కోరారు.

  • పశ్చిమగోదావరిలో..

మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆర్థిక చేయూత పథకాన్ని తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చింతలపూడి ఎమ్మెల్యే ఏలిజా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. చింతలపూడి నియోజక వర్గంలో మొత్తం 15061 మంది లబ్ధిదారులకు రూ.28 కోట్లు పంపిణీ జరిగినట్లు తెలిపారు.

  • తూర్పుగోదావరిలో...

వైఎస్సార్ చేయూత లబ్ధి పొందిన వారు ఏదో ఒక వ్యాపకం మొదలుపెట్టి జీవనోపాధి పొందాలని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి చక్రధరరావు సూచించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళ లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్సాఆర్ చేయూత పథకాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు మంజూరు దృవపత్రాలు అందజేశారు.

  • గుంటూరులో..

వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందజేసే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లోకి నగదును నేరుగా జమచేస్తారని తెలిపారు.

  • చిత్తూరులో..

వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా తిరుపతిలో 5906 మంది లబ్ధిదారులకు రూ. 1,8750 వారివారి ఖాతాలో జమ చేశామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

  • నెల్లూరులో..

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వరప్రరసాద్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద మహిళ తన స్వశక్తితో ఎదగాలని రాష్ట్రంలో ఉన్న 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కు చేయూతగా రూ.75,000లను అందిస్తున్నారని ఆయన తెలిపారు.

  • ప్రకాశంలో..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఏఎంసీ చైర్మన్ మూర్తిరెడ్డి ప్రారంభించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.

  • శ్రీకాకుళంలో...

ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు... నవరత్నాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాస కళావతి పేర్కొన్నారు. ఇప్పటికే చాలావరకు హామీలను ముఖ్యమంత్రి పూర్తి చేశారన్నారు. మహిళలు ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

  • కడప జిల్లాలో..

కడప జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్ చేయూత పథకం కార్యక్రమాన్ని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానాంలు ప్రారంభించారు. 3600కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ కష్టాలను తెలుసుకుని ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

  • అనంతపురంలో..

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బుధవారం రూ.52 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తుందన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 15,435 మంది మహిళలకు రూ. 28.94 కోట్ల రూపాయలు జగన్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో భవన నిర్మాణ కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.