తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై వైఎస్ షర్మిల ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో... ఉద్యోగ దీక్ష చేపట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష... సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల... తెలంగాణ కోసం యువత త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన విద్యార్థులు, యువకులు.. ప్రభుత్వ నోటిఫికేషన్‌ల కోసం వేచి చూసి వేసారి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల పక్షాన ముందుండి పోరాడతామని ప్రకటించారు. యువత చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. ఖాళీలు భర్తీ చేసేదాక కేసీఆర్‌ను వదలబోమని తెలిపారు. నిరుద్యోగులకు సంఘీభావంగా 3 రోజులు దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. 4వ రోజు నుంచి ప్రతి జిల్లాలో తమ కార్యకర్తలు దీక్షలు చేపడతారని వివరించారు.
ఇదీ చూడండి: