ఎన్నికల ముందు నవరత్నాల్లో ఇచ్చిన అన్ని హామీలను ఏడాది కాలంలోనే 90శాతం మేర అమలు చేశామని వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు సీఎం జగన్ 10 వేల కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు.
ప్రతిపక్షం కోర్టులో కేసులు వేసి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని ఇటీవల భాజపా నేత రాంమాధవ్ చేసిన వాఖ్యలపై తెదేపా అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రమేష్ ఆసుపత్రి ఘటనపై చంద్రబాబు స్పందించకపోవటానికి గల కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి