ETV Bharat / city

ఆక్రమణలు తొలగిస్తే ఎందుకు రాద్ధాంతం ?: ఎమ్మెల్యే అమర్నాథ్​ - గీతం వర్శిటీ అక్రమ కట్టడాలు కూల్చివేత వార్తలు

తెదేపా నేతలపై వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూఆక్రమణలను తొలగిస్తే తప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు. గీతం వర్శిటీ 40 ఎకరాల భూమిని ఆక్రమించడాన్ని తీవ్రంగా ఖండించారు. భూ ఆక్రమణలు తొలగిస్తే తెదేపా నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.

ycp mla gudivada amarnath
ycp mla gudivada amarnath
author img

By

Published : Oct 24, 2020, 2:47 PM IST

భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే... తెదేపా నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని వైకాపా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అధీప్​రాజ్​తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమర్నాథ్... గీతం యూనివర్సిటీ 40 ఎకరాల భూమిని ఆక్రమించడాన్ని ఖండించారు. బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు భూమి స్వాధీనం చెసుకుంటే... తెదేపా నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

భూ ఆక్రమణలు తొలగిస్తే తెదేపా నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే... వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు.వందల కోట్లు విలువ చేసే భూమిని అక్రమిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. విశాఖలో విలువైన భూములు కాపాడుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని...ఆ మేరకు ఎవరు ఆక్రమణలకు పాల్పడినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.