కొత్త ఎన్నికల కమిషనర్‌ను తీసుకొచ్చేందుకు.... ఉన్న కమిషనర్ పదవీకాలం కుదిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 243-కె చట్టానికి ఈ ఆర్డినెన్స్ వ్యతిరేకమని తెలిపిన యనమల... జూన్‌లో జరిగే ఉభయసభల సమావేశాల్లో మండలిలో ప్రవేశపెట్టబోయే ఆర్డినెన్స్‌ను అడ్డుకుని తీరుతామని యనమల స్పష్టం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి అయిన నూతన ఎన్నికల కమిషనర్... చట్టాలు తెలిసి కూడా బాధ్యతలు చేపట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: మహారాష్ట్రలో కొత్తగా 134 కరోనా కేసులు