ETV Bharat / city

15 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు - తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

పంచనారసింహులతో స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతోన్న తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 15 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మార్చి 22న బాలాలయంలో జరిగే స్వామివారి తిరుకల్యాణోత్సవానికి తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను ఆహ్వానించారు.

yadadri temple
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు గవర్నర్​కు ఆహ్వానం
author img

By

Published : Mar 13, 2021, 8:23 AM IST

తెలంగాణలోని సుప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 25 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. యాదాద్రిలో ఏటా ఫాల్గుణ మాసంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి 15 నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలను తొలిరోజు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్నారు. రెండో రోజు ధ్వజారోహణంతో పాటు మూడో రోజు నుంచి అలంకరణ సేవోత్సవాలు జరగనున్నాయి.

21వ తేదీ నుంచి విశేష ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వీటిలో 21న ఎదుర్కోళ్లు, 22న యాదగిరీశుడి తిరు కల్యాణోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం కనులవిందుగా జరగనుంది. 24న శ్రీచక్ర తీర్థ స్నానం జరగనుండగా, 25న అష్టోత్తర శతఘట అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, స్వామివారి తిరు కల్యాణోత్సవానికి రాష్ట్ర పెద్దలను ఆహ్వానించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈనెల 22న బాలాలయంలో జరగనున్న స్వామివారి తిరుకల్యాణానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి:

తెలుగు కవులకు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.