ETV Bharat / city

Yadadri Temple: అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఖర్చు... మరో 200 కోట్లు అవసరం! - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని యాదాద్రిలో కృష్ణ శిలతో ప్రధాన ఆలయ పనులన్నీ పూర్తైనట్లు యాడా అధికారులు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు రూ. వెయ్యికోట్లు ఖర్చు అయ్యాయని... మొత్తం పూర్తయ్యే వరకు మరో రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.

Yadadri Temple: అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఖర్చు... మరో 200 కోట్లు అవసరం!

author img

By

Published : Jun 18, 2021, 2:58 AM IST

తెలంగాణ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి(Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple) ఆలయ పునరుద్ధరణ పనులు... చివరి అంకంలో ఉన్నాయి. ప్రధాన ఆలయ పనులన్నీ పూర్తి కాగా... ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రముఖుల విడిది కోసం కాటేజీలు, వీవీఐపీ అతిథిగృహం నిర్మాణం పూర్తి కాగా... ఇతర పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి.

అభివృద్ధి పనుల కోసం ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు కాగా... మొత్తం పూర్తయ్యే వరకు మరో 200 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. ఆలయనగరిపై దాతల విరాళాల(Donor Donations)తో కాటేజీల నిర్మాణం జరగాల్సి ఉంది. నిర్మాణ విధివిధానాలపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ త్వరలో యాదాద్రిలో పర్యటించి మిగిలిన పనులకు సంబంధించి... అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాలు, నిర్మాణం, సౌకర్యాలకు రూ.84 వేల కోట్లు: ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.