ETV Bharat / city

'కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి' - ప్లాస్మా థెరపీ తాజా వార్తలు

కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 37,555 మంది ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహార్ రెడ్డి కోరారు. కొవిడ్ రోగుల ప్రాణాల్ని కాపాడటంలో సహాయకారిగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

who have recovered from Covid should come forward to give plasma
.జవహార్ రెడ్డి
author img

By

Published : Jul 24, 2020, 12:07 AM IST

కొవిడ్ నుంచి కోలుకున్న వారందరూ ప్లాస్మా థెరపీకి ముందుకు రావాలని... వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐసియూలో ఉన్న కొవిడ్ రోగుల ప్రాణాల్ని కాపాడటంలో సహాయకారిగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొవిడ్ బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చివరి అస్త్రం ప్లాస్మా థెరపీ అని ఆయన వివరించారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల త్వరగా కొవిడ్ పేషెంట్లు కోలుకుంటారని వెల్లడించారు.

తిరుపతిలోని స్విమ్స్, కర్నూలులోని జీజీహెచ్​లలో ప్లాస్మా థెరపీకి ఐసీఎమ్మార్ అనుమతి ఇచ్చిందని జవహార్ రెడ్డి తెలిపారు. జీజీహెచ్ విజయవాడ, గుంటూరులలో ప్లాస్మా థెరపీ అనుమతి కోసం ఐసీఎమ్మార్​కు విజ్ఞాపన పంపించామని తెలిపారు. ప్లాస్మా ను తీసే విధానంలో ఆపోహలొద్దని స్పష్టం చేశారు. కోలుకున్న కొవిడ్ పేషెంట్ల రక్తం పైనున్న ద్రవంలాంటి ప్లాస్మాని మాత్రమే తీస్తారని వివరించారు.

ప్లాస్మాను తీయడం వల్ల వారిలో ఎటువంటి సమస్యలూ రావని జవహార్ రెడ్డి తెలిపారు. ఐసీఎమ్మార్ నియమ నిబంధనల మేరకే ప్లాస్మాను వేరుచేస్తారని స్పష్టం చేశారు. ఇతరత్రా వ్యాధులున్న వారు, గర్భిణీలు, వృద్ధుల నుంచి ప్లాస్మా సేకరణ ఉండదని తేల్చిచెప్పారు. ప్లాస్మా థెరపీ వల్ల ఎటువంటి అనర్థాలు జరగవని వివరించారు. కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 37,555 మంది ప్లాస్మాను ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.

ఇదీ చదవండీ... 'కరోనాను ఎదుర్కొనేందుకు నాలుగు "టీ" ల సూత్రాన్ని అనుసరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.