ETV Bharat / city

'పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?' - local elections in ap 2020 news

రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తే పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ పట్ల అనుమానం వస్తోందన్నారు.

raghurama krishnam raju
raghurama krishnam raju
author img

By

Published : Nov 4, 2020, 8:42 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉంటే ఏకగ్రీవాలు జరగవన్న భయం వైకాపా నేతల్లో కనబడుతోందని ప్రజలు అనుకుంటున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

రాజస్థాన్​లో స్థానిక సంస్థల ఎన్నికలు, బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తే పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ పట్ల అనుమానం వస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకించిన రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని గమనించాలన్నారు.

మరోవైపు క్రీడా, పర్యాటక శాఖ మంత్రికి పోలవరానికి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదని రఘురామ వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణం విషయంలో మంత్రులు చేసే పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజలలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయన్నారు.

ఇదీ చదవండి

ఆ ఒప్పందంతో ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదు: మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.