ETV Bharat / city

EDUCATION: ఫార్మెటివ్‌ రాత పరీక్షకు 70%వెయిటేజీ - ఏపీ పదో తరగతి గ్రేడ్స్

గతేడాది (2019-20), ఈ సంవత్సరం (2020-21) పదో తరగతి మార్కుల కేటాయింపునకు అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి కమిటీ అందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయించనున్నారు.

weightage for formative written test
weightage for formative written test
author img

By

Published : Aug 3, 2021, 6:47 AM IST

పదో తరగతి ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. గతేడాది (2019-20), ఈ సంవత్సరం (2020-21) పదో తరగతి మార్కుల కేటాయింపునకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయిస్తారు.

మార్కుల కేటాయింపు ఇలా...

2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్‌ పరీక్షలను... ఒక్కో దానికి 50 మార్కులకు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు 10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు ఇచ్చారు. మార్కులను కేటాయించేందుకు రాత పరీక్షకు 70%, ఇతర 30 మార్కులకు 30% వెయిటేజీ ఇవ్వనున్నారు. రాత పరీక్షను 70% అంటే 20 మార్కులను 35కు తీసుకువస్తారు. మిగతా 30 మార్కులను 30% వెయిటేజీతో 15 మార్కులకు కుదిస్తారు.
ఒక విద్యార్థికి రాత పరీక్షలో 20 మార్కులకు 18 వచ్చాయనుకుంటే 35 మార్కులకు పెంచడం (18్ల35/20)తో 31.5 మార్కులకు చేరతాయి.

* మిగతా 30 మార్కులను 15కు కుదిస్తారు. అంటే.. విద్యార్థికి 30 మార్కులకు 27 వస్తే వెయిటేజీ ప్రకారం (15్ల27/30) 13.5గా తీసుకుంటారు.

* మొత్తం కలిపి ఫార్మెటివ్‌లో 45 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు.

* ఇలాగే రెండో మరో ఫార్మెటివ్‌నూ లెక్కిస్తారు. రెండింటిలో వచ్చిన మార్కులను కలిపి సబ్జెక్టు గ్రేడ్‌ ప్రకటిస్తారు.

* అన్ని మార్కులను కలిపి మొత్తం గ్రేడ్‌, గ్రేడ్‌పాయింట్లు ఇస్తారు.

* ఒకవేళ విద్యార్థి ఒకే ఫార్మెటివ్‌ పరీక్షనే రాస్తే దాని ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

* విద్యార్థి రెండు ఫార్మెటివ్‌ పరీక్షలను రాయకపోయినా, ఒకవేళ రాసినా ఏ కారణాలతోనైనా మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోతే వారికి కనీస ఉత్తీర్ణత మార్కులు ఇస్తారు.

* రెగ్యులర్‌ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా వృత్తి విద్యా కోర్సు విద్యార్థులకు మార్కులు ఇస్తారు.

* 2017, 2018, 2019లో అనుత్తీర్ణులై 2021లో పరీక్ష ఫీజు చెల్లించిన వారికి అంతర్గత మార్కులు 20కు గాను వారు సాధించిన వాటిని అయిదుతో గుణిస్తారు. ఉదాహరణకు 20(20్ల5=100)మార్కులకు 10 వస్తే(10్ల5) 50 మార్కులు ఇస్తారు.

ప్రభుత్వ విద్యార్థులకు వెయిటేజీ

గతేడాది (2019-20) పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్ల కేటాయింపులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. అంతర్గత మార్కుల ప్రకారం ప్రైవేటు విద్యార్థులకు ఎక్కువగా ఏ1 గ్రేడ్లు వస్తుండటంతో ప్రభుత్వ పిల్లలకు వెయిటేజీకి ఛాయా రతన్‌ కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన అధికారులు ఎలాంటి గ్రేడ్లు, మార్కులు ఇవ్వకుండా అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. మార్కుల మెమోల్లోనూ ఉత్తీర్ణులైనట్లు మాత్రమే ఇచ్చారు. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు లేనందున ఆర్మీ, ఇతరత్రా ఉద్యోగాలు, కళాశాలల ప్రవేశాలకు ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్ల కేటాయింపునకు కమిటీ సిఫార్సు చేసింది.

* ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫార్మెటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన దాన్ని మాత్రమే తీసుకుంటారు. దీని ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు.

* వృత్తి విద్యా కోర్సులకు రెగ్యులర్‌ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు.

ఇదీ చదవండి: విశాఖలో అడుగు పెట్టనివ్వం: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.