ETV Bharat / city

తెలంగాణ: రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్​ - ghmc election campaign updates

ఆరేళ్లలో కేంద్రం ఏమిచ్చిందో భాజపా నేతలు చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్​ డిమాండ్ చేశారు. ​అసలు కాషాయ పార్టీకి ఎందుకు ఓటువెయ్యాలో ప్రజలు వారినే నిలదీయాలని సూచించారు. ఖైరతాబాద్ లైబ్రరీ సెంటర్​ వద్ద రోడ్​ షోలో కేంద్రం, భాజపా నాయకులపై విమర్శణాస్త్రాలు ఎక్కుపెట్టారు.

we-will-applaud-if-bjp
రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం
author img

By

Published : Nov 22, 2020, 10:49 PM IST

'ఒకప్పుడు రెండు వారాలకొకసారి నీళ్లు వచ్చేవి.. ఇప్పుడు రోజు తప్పించి రోజు వస్తున్నాయ్.. కరెంట్ కష్టం, తాగునీటి తండ్లాట పోయింది.. 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతిభద్రల సమస్య లేకుండా చేశాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్​కు పెట్టుబడులు వస్తున్నాయ్'​ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.

ఆరేళ్లలో కేంద్రం నుంచి సికింద్రాబాద్​ పార్లమెంట్​కు రూపాయైనా కిషన్ రెడ్డి తీసుకొచ్చారా అని కేటీఆర్​ నిలదీశారు. ఎందుకు భాజపాకు ఓటు వెయ్యాలో ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. గత ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు కట్టామని.. రాష్ట్రానికి మాత్రం తిరిగి కేవలం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. రూపాయి మనమిస్తే.. ఆఠానా మాత్రమే మనకిస్తున్నారని మండిపడ్డారు.

కష్టంలో ఉన్న 6.50 లక్షల హైదరాబాద్ వరద బాధితులకు రూ.10వేలు చొప్పున అందజేస్తుంటే మోకాలు అడ్డుపెట్టారని ధ్వజమెత్తారు. ప్రధానిని ఒప్పించి వారికి రూ.25 వేలు ఇప్పిస్తే తామే చప్పట్లు కొడతామని కేటీఆర్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం రూ.67వేల కోట్లు ఖర్చుచేసిందన్న ఆయన.. మోదీ ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పాలని భాజపాను డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి:

మహిళలు, బాలల భద్రతకు 'అభయం'... ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.