తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రంజిత్ అనే యువకుడు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడానికి(AWARENESS ON FITNESS) 4,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి... నగరానికి ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్(vinay bhaskar), వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, వావ్ వరంగల్ టీమ్ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. రంజిత్ తండ్రి గతేడాది కరోనాతో(corona) మరణించారు. దీంతో మనస్తాపానికి గురైన రంజిత్.. కొవిడ్(covid) సమయంలో ఫిట్‌నెస్(fitness) చాలా ముఖ్యమని భావించి.. దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
సైకిల్‌పై వరంగల్ నుంచి కశ్మీర్, కన్యాకుమారి, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లారు. 4500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసుకుని హనుమకొండకు చేరుకోవడంతో రంజిత్ కు పలువురు అభినందలు తెలిపారు. అనంతరం నగరంలో సైకిల్ ర్యాలీ చేపట్టి చీఫ్ విప్ వినయభాస్కర్‌తో కలిసి మొక్కలను నాటారు.
ఇదీ చదవండి:
CJI JUSTICE NV RAMANA: సమకాలీన అంశాలపై యువత దృష్టి సారించాలి: సీజేఐ