తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. తెల్లరేషన్ కార్డులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వీఆర్ఏలకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏలు ధర్నా చేశారు.సమస్యలను పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని అన్నారు.
ఒప్పంద ఉద్యోగులు, వివోఏలు నిరసన
పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఒప్పంద ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేపట్టారు. తమ వేతనాలను 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 131, 57, 142జీఓలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు
విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు కన్నబాబు నివాసం ఎదుట డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. వివోఏల తొలగింపు నిర్ణయం అన్యాయమన్నారు.
ఇదీ చదవండి: