ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా.. జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ వెల్లడించారు. జాతీయ ఎన్నికల సంఘం నిర్వహించే ఈ పోటీల్లో అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఈ పోటీల్లో భాగంగా.. క్విజ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, పాట, నినాదం అనే ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన వారికి నగదు పురస్కారంతోపాటు ఈ-సర్టిఫికెట్ కూడా అందజేస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు తమ ఎంట్రీలను మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు: కమిషనర్ అరుణ్‌కుమార్