ETV Bharat / city

వి'శోక' ఘట్టంలో.. క్షణం.. క్షణం..!

author img

By

Published : May 7, 2020, 6:19 AM IST

Updated : May 7, 2020, 9:30 PM IST

vizag
vizag

19:09 May 07

గ్యాస్​ తీవ్రత తగ్గించేందుకు గుజరాత్​ రసాయనం

  • విశాఖ గ్యాస్ లీక్ ప్రాంతంలో తీవ్రత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు
  • 500 కిలోల పీటీబీసీ రసాయనం పంపాలని గుజరాత్‌ను కోరిన ఏపీ ప్రభుత్వం
  • పీటీబీసీ పంపాలని గుజరాత్‌ సీఎంకు విజ్ఞప్తి చేసిన సీఎం జగన్‌
  • లీకైన విషవాయువు స్టైరిన్‌ ప్రభావాన్ని తగ్గించనున్న పీటీబీసీ
  • గుజరాత్‌లోని వాపిలో మాత్రమే తయారవుతున్న పీటీబీసీ
  • వాపి నుంచి రోడ్డుమార్గంలో దామన్‌కు పీటీబీసీ తరలింపు
  • దామన్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి పీటీబీసీ పంపుతున్న గుజరాత్‌

17:35 May 07

ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై కేసులు నమోదు

  • విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై కేసులు నమోదు
  • వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు
  • సెక్షన్‌ 337, 338, 304 కింద కేసులు నమోదు

17:34 May 07

ఎన్‌జీటీలో పిటిషన్

  • విశాఖ ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని ఎన్‌జీటీలో పిటిషన్
  • సీడబ్ల్యూఈఎల్‌ ఫౌండేషన్ తరఫున పిటిషన్‌ వేసిన గౌరవ్‌ బన్సల్
  • విశ్రాంత న్యాయమూర్తి, శాస్త్రవేత్త ద్వారా విచారణ జరపాలని కోరిన పిటిషనర్‌

16:35 May 07

సీఎం జగన్​కు కన్నా అభినందనలు

  • విశాఖ ఘటన మృతులకు రూ.కోటి పరిహారంపై భాజపా హర్షం
  • రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌కు అభినందనలు: కన్నా
  • విశాఖ గ్యాస్ ప్రమాద ఘటన దురదృష్టకరం: కన్నా లక్ష్మీనారాయణ
  • కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: కన్నా లక్ష్మీనారాయణ
  • ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి: కన్నా లక్ష్మీనారాయణ

15:46 May 07

శ్రామిక్ రైళ్ల రాకపోకలపై విశాఖ గ్యాస్ లీక్ ప్రభావం

  • శ్రామిక్ రైళ్ల రాకపోకలపై విశాఖ గ్యాస్ లీక్ ఘటన ప్రభావం
  • విశాఖ: సింహాచలం నార్త్ స్టేషన్‌లో నిలిచిన 9 శ్రామిక్ రైళ్లు
  • వలసకూలీలను తీసుకుని వెళ్తున్న శ్రామిక్ రైళ్లు

15:29 May 07

కన్నాకు అనుమతి

  • విశాఖ వెళ్లేందుకు కన్నా లక్ష్మీనారాయణకు ప్రభుత్వం అనుమతి
  • గుంటూరు నుంచి విశాఖబయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణ
  • గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించనున్న కన్నా

15:18 May 07

విశాఖ ఘటనపై హైకోర్టు నోటీసులు

  • విశాఖ గ్యాస్ లీకేజ్‌ ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు
  • అధిక జనాభా ఉన్నచోట ఇలాంటి పరిశ్రమ ఎలా ఉందన్న హైకోర్టు
  • ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • విచారణను వారంపాటు వాయిదా వేసిన హైకోర్టు
  • విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన హైకోర్టు
  • కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు
  • విశాఖ గ్యాస్ లీకేజ్‌ ఘటనపై విచారణ జరిపిన హైకోర్టు
  • గ్యాస్ లీకేజ్‌ ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు
  • అధిక జనాభా ఉన్న ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ ఎలా ఉందని అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు
  • కోర్టు సహాయకుడిగా హైకోర్టు బార్ అసోసియేషన్‌ అధ్యక్షుడు
  • జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించిన హైకోర్టు

15:16 May 07

మృతుల కుటుంబాలకు కోటి పరిహారం : సీఎం

సీఎం జగన్
  • మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం జగన్‌
  • ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ.25 వేలు అందిస్తాం: సీఎం
  • రెండు, మూడ్రోజులు ఆస్పతిలో ఉన్నవారికి రూ.లక్ష ఇస్తాం: సీఎం

14:48 May 07

విశాఖ ఘటన బాధాకరం : సీఎం

విశాఖ ఘటనపై సీఎం జగన్ 

  • గ్యాస్ లీక్ ఘటన బాధాకరమైన అంశం
  • ప్రముఖ కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో ఈ ఘటన జరగడం బాధాకరం
  • ఘటనపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నాం
  • లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు
  • నివేదిక పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటాం
  • గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం ఎందుకు మోగలేదు?
  • ఘటన జరిగాక వెంటనే స్పందించిన అధికారులకు అభినందనలు
  • ఉదయం 4.30 గం.కే కలెక్టర్, డీసీపీ చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు
  • 340 మందికి పైగా స్థానికులను ఆస్పత్రులకు తరలించాం
  • మృతుల కుటుంబసభ్యులకు అన్నిరకాలుగా అండగా ఉంటాం
  • మృతుల కుటుంబసభ్యులకు కంపెనీ నుంచి పరిహారం వచ్చేలా చూస్తాం
  • మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తాం
  • రెండు, మూడ్రోజులపాటు ఆస్పత్రుల్లో ఉన్నవారికి రూ.లక్ష పరిహారం ఇస్తాం
  • వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ.10 లక్షల పరిహారం

14:41 May 07

ఎయిమ్స్ డైరెక్టర్‌

  • గ్యాస్ పీల్చిన వారికి కళ్లు, గొంతునొప్పి, వాంతులు అయ్యాయి
  • గ్యాస్‌కు ప్రభావితులైన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
  • మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి
  • బాధితులు వెంటనే ఆక్సిజన్ థెరపీ తీసుకోవాలి
  • ఈ గ్యాస్ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది

14:39 May 07

తెల్లవారుజామున 2.30కు గ్యాస్ లీక్ : ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌

  • గ్యాస్‌ లీక్ ఘటన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించాం
  • గ్యాస్ లీకైన వెంటనే సహాయ చర్యలు చేపట్టాం
  • ఇళ్లలోకి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించాం
  • ఉదయం 6 గంటలకే మా బృందాలు ఘటనాస్థలానికి చేరాయి
  • 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించాం
  • గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో 10 మంది చనిపోయారు
  • 200 మందికి పైగా వైద్యసాయం పొందుతున్నారు
  • తెల్లవారుజామున 2.30కు గ్యాస్ లీక్ జరిగింది

14:37 May 07

రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్​ఆర్సీ నోటీసులు

  • విశాఖ ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం
  • రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హక్కుల సంఘం
  • మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఘటనను సుమోటోగా స్వీకరించి... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ
  • నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించిన మానవ హక్కుల సంఘం

14:18 May 07

3.45 గంటల నుంచి 5.45 మధ్య పరిస్థితి చాలా తీవ్రం: కలెక్టర్‌

  • ఆ రసాయనం ఎప్పుడూ ద్రవం రూపంలో ఉండాలి: కలెక్టర్‌
  • రసాయనం ఎప్పుడూ 20 డిగ్రీల ఉష్ణోగ్రతకు లోపే ఉండాలి: కలెక్టర్‌
  • సాంకేతిక లోపం వల్ల రాసాయనం వాయు రూపంలోకి మారింది: కలెక్టర్‌
  • తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 5.45 మధ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది: కలెక్టర్‌
  • 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల మధ్య ప్రభావిత ప్రాంతంగా భావిస్తున్నాం: కలెక్టర్‌

14:10 May 07

బాధితులకు సీఎం జగన్ పరామర్శ

బాధితులకు సీఎం జగన్ పరామర్శ
  • కేజీహెచ్‌కు చేరుకున్న సీఎం జగన్‌
  • విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శిస్తున్న సీఎం జగన్‌
  • రాజేంద్రప్రసాద్‌ వార్డులో బాధితులను పరామర్శిస్తున్న సీఎం
  • బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం
  • బాధితులకు ముఖ్యమంత్రి జగన్‌ భరోసా
  • గ్యాస్‌ లీక్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

14:02 May 07

విశాఖకు రానున్న కేంద్ర నిపుణుల బృందం

  • విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై కీలక అధికారులతో ప్రధాని ముఖ్య కార్యదర్శి ఉన్నతస్థాయి సమీక్ష
  • విశాఖకు నిపుణుల బృందాన్ని పంపాలని ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా ఆదేశం

13:39 May 07

స్థానికుల్లో భయాందోళన

ఎన్​డీఆర్​ఎఫ్ సహాయ చర్యలు
  • విశాఖ: గ్యాస్ లీక్ ఘటనతో స్థానికుల్లో భయాందోళన
  • విజయనగరం జిల్లా కొత్తవలస వెళ్తున్న గోపాలపట్నం పరిసరాల ప్రజలు
  • కరోనా దృష్ట్యా కొత్తవలస చేరుకునేందుకు అనుమతించని పోలీసులు
  • గోపాలపట్నం పరిసర ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు
  • కొత్తవలస మం. చింతలపాలెం వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు

13:16 May 07

కేజీహెచ్​లో 193 మంది బాధితులు

  • విశాఖ కేజీహెచ్‌లో 193 మంది గ్యాస్ లీక్ బాధితులకు చికిత్స
  • విశాఖ: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 66 మంది బాధితులు
  • గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రుల్లో 57 మంది బాధితులకు చికిత్స

13:08 May 07

కన్నా లేఖ

  • విశాఖలో పర్యటనకు అనుమతి కోరిన కన్నా లక్ష్మీనారాయణ
  • అనుమతి ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాసిన కన్నా

12:52 May 07

మృతులు గుర్తింపు

విశాఖ విషాదం
  • మృతులు: అప్పలనరసమ్మ (45), కుందన శ్రేయ (6)
  • చంద్రమౌళి (19)...ఏఎంసీలో తొలి ఏడాది ఎంబీబీఎస్ చదువుతున్న చంద్రమౌళి
  • గంగరాజు (48)
  • ఆర్.నారాయణమ్మ (35)
  • ఎన్‌.గ్రీష్మ (9)
  • మేకా కృష్ణమూర్తి (73)
  • గంగాధర్‌
  • మరో మృతుడిని గుర్తించాలి

12:39 May 07

గ్యాస్‌ను న్యూట్రల్ చేశాం: గౌతంరెడ్డి

  • విశాఖలో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాం: మంత్రి గౌతంరెడ్డి
  • ట్యాంకులో ద్రవరూపంలో ఉన్న గ్యాస్‌ను న్యూట్రల్ చేశాం: గౌతంరెడ్డి
  • పరిసరాల్లో ప్రమాద తీవ్రత తగ్గించే చర్యలు చేపట్టాం: గౌతంరెడ్డి
  • ఘటనకు ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి: గౌతంరెడ్డి
  • ఎల్‌జీ లాంటి కంపెనీలు మరింత బాధ్యతగా ఉండాలి: మంత్రి గౌతంరెడ్డి
  • బాధితులను రక్షించుకోవడంపైనే ప్రస్తుతం మా దృష్టి: గౌతంరెడ్డి
  • పరిశ్రమ నుంచి తక్కువ గ్యాసే లీకైంది: మంత్రి గౌతంరెడ్డి
  • గ్యాస్ లీక్ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలపై అధ్యయనం చేస్తాం: గౌతంరెడ్డి

12:26 May 07

స్టైరిన్‌ గ్యాస్‌ మానవ అవయవాలను దెబ్బ : ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌

  • ఈ గ్యాస్‌ ఘటనాస్థలంలోనే కొన్ని రోజులు ఉంటుంది: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌
  • లీకైన స్టైరిన్‌ గ్యాస్‌ మానవ అవయవాలను దెబ్బ తీస్తోంది: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌
  • ఘటనాస్థలంలో సహాయచర్యలు ముమ్మరం చేయాలి: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌
  • స్టోరేజ్ ట్యాంక్‌ నుంచి గ్యాస్ లీక్‌ను నియంత్రించారు: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌
  • అందుకే ప్రమాద తీవ్రత తగ్గింది: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌
  • ప్రమాదకరమైన వాయువులు ఉండేచోట నిత్యం పర్యవేక్షణ ఉండాలి: ప్రసాద్‌

12:05 May 07

పశువులకు చికిత్స

  • గ్యాస్ లీక్ వల్ల 22 పశువులు, 6 కుక్కలు, పిల్లి చనిపోయాయి: అధికారులు
  • అస్వస్థతకు గురైన 62 పశువులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
  • 12 బృందాలతో పశువులకు వైద్య సహాయం: పశుసంవర్థకశాఖ

12:04 May 07

బాధితులకు బస

  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు బస, ఆహారం
  • కృష్ణాపురం గోశాల వద్ద బస, ఆహార ఏర్పాట్లు చేసిన సింహాచలం దేవస్థానం
  • ప్రభావితప్రాంత ప్రజలు గోశాల వద్దకు చేరుకోవాలని దేవస్థాన సిబ్బంది విజ్ఞప్తి

11:54 May 07

విశాఖ ఘటనపై డీజీపీ

  • గ్యాస్ లీక్ తర్వాత వెంటనే సహాయ చర్యలు చేపట్టాం: డీజీపీ
  • పోలీసులు సత్వరం స్పందించి స్థానికులను రక్షించారు: డీజీపీ
  • మైక్ ద్వారా ప్రకటన చేసి స్థానికులను అప్రమత్తం చేశాం: డీజీపీ

11:52 May 07

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ

  • గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ
  • గ్యాస్ లీక్ వల్ల సుమారు 2 వేల మంది అనారోగ్యానికి గురయ్యారు: చంద్రబాబు
  • ప్రజారోగ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు
  • నిపుణులైన వైద్యసిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరిన చంద్రబాబు
  • విశాఖకు నిపుణులైన పశువైద్యులను పంపాలని చంద్రబాబు విజ్ఞప్తి
  • ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరిన చంద్రబాబు
  • పరిశ్రమను కాలుష్యం లేని సెజ్‌కు తరలించాలని సూచించిన చంద్రబాబు
  • రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిపుణులను ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు

11:43 May 07

రాష్ట్రపతి కోవింద్ దిగ్భ్రాంతి

  • విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి కోవింద్ దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన రాష్ట్రపతి
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రామ్‌నాథ్ కోవింద్‌

11:39 May 07

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో 9కి చేరిన మృతులు

  • గ్యాస్ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన మరో వ్యక్తి మృతి
  • కొత్తవలస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • మృతుడు ఎల్జీ పాలిమర్స్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు గుర్తింపు
  • గ్యాస్ లీక్‌ తర్వాత కొత్తవలసలోని బంధువుల ఇంటికి బయల్దేరిన వ్యక్తి
  • ద్విచక్రవాహనంపై వెళ్తూ చింతలపాలెం చెక్‌పోస్ట్‌ వద్ద అస్వస్థతకు గురైన వ్యక్తి
  • అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కొత్తవలస పీహెచ్‌సీలో చేర్చిన హెడ్‌కానిస్టేబుల్

11:31 May 07

మంత్రి గౌతంరెడ్డి ఆరా

  • బాధితులను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మా దృష్టి: మంత్రి గౌతంరెడ్డి
  • ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం: గౌతంరెడ్డి
  • సీఎం పర్యటన తర్వాత మరిన్ని వివరాలు ప్రకటిస్తాం: గౌతంరెడ్డి
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు: గౌతంరెడ్డి

11:20 May 07

ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి

  • విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: వెంకయ్యనాయుడు
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వెంకయ్యనాయుడు
  • గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడా: వెంకయ్య
  • సహాయ చర్యలు ముమ్మరం చేయాలని కిషన్‌రెడ్డిని కోరా: వెంకయ్య

11:18 May 07

ఆస్పత్రుల్లో బాధితులు

  • విశాఖ కేజీహెచ్‌లో 187 మంది బాధితులకు చికిత్స
  • విశాఖ: అపోలో ఆస్పత్రిలో 48 మంది బాధితులకు చికిత్స
  • విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో 12 మంది బాధితులకు చికిత్స

11:12 May 07

సీఎంకు గవర్నర్ ఫోన్

  • గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా సీఎంకు ఫోన్‌
  • ప్రమాద కారణాలు సహా, సహాయక చర్యలను గవర్నర్ కు వివరించిన సీఎం

11:07 May 07

విశాఖ ఘటనపై మోదీ సమీక్ష

  • విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
  • సమీక్షలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు

11:04 May 07

నారా లోకేశ్‌ విచారం

  • విశాఖ గ్యాస్ లీక్‌ ప్రమాదంపై నారా లోకేశ్‌ విచారం
  • మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన లోకేశ్‌
  • ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్
  • సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీశ్రేణులకు పిలుపు
     
11:03 May 07

విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు

  • విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన చంద్రబాబు
  • బాధితులను పరామర్శించి సహాయచర్యలు చేపట్టేందుకు అనుమతి కోరిన చంద్రబాబు
  • ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు
  • కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే విశాఖ వెళ్లనున్న చంద్రబాబు

11:01 May 07

ఐఐసీటీ విశ్రాంత శాస్త్రవేత బాబూరావు

  • ఇలాంటి పరిశ్రమలు నిర్మించినప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి: విశ్రాంత శాస్త్రవేత్త బాబూరావు
  • పరిసరాల్లోని ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించాలి: విశ్రాంత శాస్త్రవేత్త
  • ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఏం చేయాలనేది ప్రజలకు చెప్పాలి: విశ్రాంత శాస్త్రవేత్త
  • ఇప్పటివరకు ఏ గ్యాస్ లీకైందో స్పష్టంగా చెప్పలేదు: విశ్రాంత శాస్త్రవేత్త

11:00 May 07

తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

  • విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
  • విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం: కేసీఆర్
  • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: కేసీఆర్
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: కేసీఆర్

10:50 May 07

లీకైన వాయువు చాలా బరువైంది: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌

  • లీకైన వాయువు చాలా బరువైంది: ఐఐపీఈ డైరెక్టర్ ప్రసాద్‌

10:42 May 07

సీఎం జగన్​కు ప్రధాని మోదీ ఫోన్‌

  • విశాఖ ఘటనపై సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
  • గ్యాస్ లీక్ ఘటన, సహాయ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్న ప్రధాని
  • కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ

10:42 May 07

మంత్రి ఆళ్ల నాని ఆరా

  • విశాఖ ఘటనపై వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని
  • అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
  • బాధితులకు పండ్లు, భోజనం అందించాలని అధికారులకు ఆదేశం

10:41 May 07

మంత్రి కన్నబాబు ఆరా

  • గ్యాస్ లీక్ ఘటనపై అధికారులతో మాట్లాడిన మంత్రి కన్నబాబు
  • సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం
  • సీఎం జగన్‌తో విశాఖ వెళ్లనున్న మంత్రి కన్నబాబు

10:40 May 07

విశాఖ ఘటనపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

  • విశాఖ గ్యాస్ లీక్ ఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యా: రాహుల్‌గాంధీ
  • సహాయ చర్యల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొనాలి: రాహుల్‌
  • బాధితులకు సాయం చేయాలి, అండగా ఉండాలి: రాహుల్‌
  • మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: రాహుల్‌
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: రాహుల్‌

10:35 May 07

అమిత్ షా విచారం

  • విశాఖ ఘటన మనసు కలిచి వేసింది: హోంమంత్రి అమిత్ షా
  • విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నా: అమిత్ షా
  • మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షణ చేస్తున్నాం: హోంమంత్రి అమిత్ షా
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: హోంమంత్రి అమిత్ షా

10:32 May 07

ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌

  • విశాఖలో లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరమైంది: ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌
  • ఈ గ్యాస్‌ నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది: ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌
  • ఈ గ్యాస్ వల్ల తలనొప్పి, వాంతులు, వినికిడి లోపం: ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌
  • ఈ గ్యాస్ వల్ల మానసిక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం: ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌
  • లీకైన గ్యాస్‌ అక్కడే ఎక్కువకాలం ఆవరించి ఉంటుంది: ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌
  • ఘటనా స్థలంలో మాస్కులు వాడటం అవసరం: ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌

10:24 May 07

గ్యాస్ లీక్‌ సహాయచర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

  • గ్యాస్ లీక్‌ సహాయచర్యల్లో 27 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది: డీజీ
  • ఘటనాస్థలం నుంచి 90 శాతం మంది ప్రజలను తరలించాం: ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ

10:21 May 07

తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి

  • విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్
  • చికిత్స పొందుతున్న వాళ్లు త్వరగా కోలుకోవాలి: తెలంగాణ మంత్రి కేటీఆర్

10:18 May 07

విశాఖ ఘటనపై ప్రధాని విచారం

విపత్తు నిర్వహణశాఖ అధికారులతో పీఎం మోదీ భేటీఅయ్యారు. 

  • విశాఖ విషవాయువు లీకేజ్‌ ఘటనపై ప్రధాని మోదీ విచారం
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష
  • కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణశాఖతో మాట్లాడిన ప్రధాని
  • సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం

10:12 May 07

గవర్నర్ దిగ్భ్రాంతి

  • విశాఖ గ్యాస్ లీక్‌ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్
  • యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన గవర్నర్‌
  • ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వాలంటీర్ ల సేవలను వియోగించుకోవాలని సూచించిన గవర్నర్
  • తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్ కు ఆదేశాలు

09:45 May 07

విశాఖ 66వ వార్డులో ఎక్కువ ప్రభావం

  • గ్యాస్ లీక్ వల్ల గ్రేటర్ విశాఖ 66వ వార్డులో ఎక్కువ ప్రభావం
  • మృతులు, బాధితుల్లో ఎక్కువమంది ఆర్‌.ఆర్.వెంకటాపురం వాసులు
  • గ్యాస్ లీక్ ప్రాంతంలో రసాయనాలు పిచికారీ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురం, ఎస్‌వీబీసీ కాలనీలో సహాయ చర్యలు ముమ్మరం
  • ఘటనాస్థలానికి పరిశ్రమ నిపుణులను తీసుకువచ్చిన అధికారులు
  • విషవాయువు బరువైనది కావడం వల్లే ఎక్కువమందికి అస్వస్థత: అధికారులు
  • ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన మంత్రి అవంతి, కలెక్టర్ వినయ్‌చంద్‌
  • పరిశ్రమ పరిసరాల్లోని ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
  • ఘటనాస్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది: అధికారులు

09:40 May 07

విశాఖ కలెక్టర్

  • లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమ ప్రారంభించే సమయంలో ప్రమాదం: కలెక్టర్‌
  • ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో ఫెర్లిన్‌ వాయువు లీకైంది: కలెక్టర్‌ వినయ్‌చంద్‌
  • సుమారు 300 మంది విషవాయువు పీల్చారు: కలెక్టర్‌ వినయ్‌చంద్‌
  • బాధితులు అందరినీ కేజీహెచ్‌కు తరలిస్తున్నాం: కలెక్టర్ వినయ్‌చంద్‌
  • 108, కొవిడ్‌ కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లు సహాయక చర్యలు చేపట్టాం: కలెక్టర్‌
  • పరిశ్రమల సెక్యూరిటి వింగ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి: కలెక్టర్‌

09:32 May 07

లీకైన వాయువు చాలా ప్రమాదకం

  • లీకైన వాయువు చాలా ప్రమాదకరమైంది: వైద్యులు
  • బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం: వైద్యులు

09:23 May 07

డీసీపీకి అస్వస్థత

  • సహాయచర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన డీసీపీ బిర్లా
  • సమీపంలోని గ్రామాల్లోకి వెళ్లలేక పోతున్న సహాయ సిబ్బంది
  • సొంతవాహనాలు, అంబులెన్స్‌ల్లో కేజీహెచ్‌కు తరలింపు
  • తన వాహనంలోనే బాధితులను ఆస్పత్రికి తరలించిన విశాఖ నగర సీపీ
  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • పరిశ్రమలోని లీకేజీ ప్రాంతాన్ని అదుపుచేయడానికి యత్నిస్తున్న బృందాలు
  • అపస్మారక స్థితిలో ఉన్నవారిని తరలిస్తున్న ఎన్టీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, పోలీసులు బృందాలు
     
09:07 May 07

సహాయ చర్యల్లో నౌకాదళం

  • విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన సహాయ చర్యల్లో నౌకాదళం
  • అంబులెన్సులు, మెడికల్ కిట్‌లతో రంగంలోకి దిగిన భారత నౌకాదళం

09:00 May 07

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్ ఆవేదన

  • విశాఖ వెళ్లనున్న సీఎం జగన్‌
  • పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం
  • సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్న సీఎం
  • తర్వాత ఘటనపై సమీక్ష చేయనున్న సీఎం

08:49 May 07

విశాఖ ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా

  • విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆరా తీస్తున్న కేంద్ర హోం శాఖ
  • ఘటన వివరాలు తెలుసుకుంటున్న అధికారులు

08:46 May 07

8 మంది మృతి

  • విశాఖ: ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో 8 మంది మృతి, పలువురికి అస్వస్థత
  • విశాఖ: ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ముగ్గురు, కేజీహెచ్‌లో ఐదుగురు మృతి
  • కేజీహెచ్‌ క్యాజువాల్టీలో ముగ్గురు, ఆర్పీ వార్డులో ఇద్దరు మృతి

08:41 May 07

ఎనిమిది మంది మృతి

  • విశాఖ: ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి, పలువురికి అస్వస్థత
  • విశాఖ: మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి

08:40 May 07

ఐదుగురు మృతి

  • విశాఖ: ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి, పలువురికి అస్వస్థత

08:28 May 07

నారా లోకేష్ విచారం

  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ఘటన పట్ల నారా లోకేష్‌ విచారం

08:22 May 07

చంద్రబాబు దిగ్భ్రాంతి

  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
  • పలువురు మృతి చెందడం, ఆస్పత్రిపాలుకావడం పట్ల చంద్రబాబు ఆవేదన
  • మనుషులే కాదు మూగజీవాలు మృతిచెందాయి: చంద్రబాబు 
  • కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలి: చంద్రబాబు
  • చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శనం: చంద్రబాబు
  • యుద్దప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: చంద్రబాబు
  • బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలి: చంద్రబాబు
  • సహాయ చర్యలు వేగపరచాలి... కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి: చంద్రబాబు

07:57 May 07

వందల సంఖ్యలో బాధితులు

  • విశాఖ: ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో ముగ్గురు మృతి, పలువురికి అస్వస్థత

  • వాయు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి గంగరాజు మృతి
  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో మృత్యువాత పడిన పలు పశువులు
  • విశాఖ: వందల సంఖ్యలో బాధితులను ఆస్పత్రులకు తరలింపు
  • సాయంత్రానికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్న కేజీహెచ్ వైద్యులు
  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఇళ్లలోనే చిక్కుపోయిన ప్రజలు
  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్​డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • తలుపులు బద్దలు కొట్టి ఇళ్లలోకి వెళ్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది

07:53 May 07

గ్యాస్‌ లీక్‌ ప్రమాదం

07:46 May 07

పోలీసులు

  • గ్యాస్‌ లీక్‌ ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు: పోలీసులు
  • వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాం: పోలీసులు
  • పోలీసు వాహనాల ద్వారా ప్రజలను తరలించాం: పోలీసులు
  • ఎన్డీఆర్‌ఎఫ్‌ బందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టాం: పోలీసులు

07:35 May 07

సహాయక చర్యలు ముమ్మరం

విశాఖ విషాదం
  • ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో సహాయక చర్యలు చేపట్టిన సహాయక బృందాలు

07:29 May 07

ప్రమాదం పై మంత్రి అవంతి స్పందన

  • తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగింది: మంత్రి అవంతి శ్రీనివాస్‌
  • అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు: అవంతి శ్రీనివాస్‌
  • బాధితులు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం: మంత్రి అవంతి

07:13 May 07

విశాఖ ప్రమాదం పై సీఎం ఆరా

  • విశాఖలో ఆర్‌.ఆర్‌. వెంకటాపురం వద్ద పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనపై సీఎం ఆరా
  • కలెక్టర్, కమిషనర్ల తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి
  • తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశం
  • బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం

07:11 May 07

ముగ్గురు మృతి

విశాఖ: ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో ముగ్గురు మృతి...మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఒక చిన్నారి ఉన్నారు.

06:59 May 07

విశాఖ: గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని పరిశ్రమలో భారీ ప్రమాదం

విశాఖ: ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు, ఇద్దరు మృతి 

విశాఖ: సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన రసాయన వాయువు

06:36 May 07

ఎమ్మెల్యే గణబాబు

  • రసాయన వాయువు పీల్చి పలువురు అస్వస్థతకు గురయ్యారు: గణబాబు
  • వెంకటాపురంలో ఇళ్లలోనే పలువురు స్థానికులు ఉండిపోయారు: గణబాబు
  • ఇళ్లలోనే ఎందరు ఉండిపోయారనేది తెలుసుకోవాలి: ఎమ్మెల్యే గణబాబు
  • బాధితులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం: గణబాబు
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరిస్తున్నాం: ఎమ్మెల్యే గణబాబు
  • కరోనా చర్యలకు కేటాయించిన అంబులెన్స్‌ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాం: గణబాబు

06:24 May 07

విశాఖ ఘటనపై కలెక్టర్
  • రసాయన వాయువు లీకేజీతో ప్రమాదం జరిగింది: కలెక్టర్‌
  • వాయువు పీల్చడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు: కలెక్టర్‌
  • 200 మందికిపై ప్రజలు అస్వస్థతకుగురై ఉంటారని భావిస్తున్నాం: కలెక్టర్‌
  • వైద్యసేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్‌
  • అవసరమైన ఆక్సీజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాం: కలెక్టర్‌
  • మరో గంటన్నరపాటు వాయు ప్రభావం ఉండే అవకాశం ఉందని భానిస్తున్నాం: కలెక్టర్‌

06:19 May 07

  • విశాఖ: గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని పరిశ్రమలో భారీ ప్రమాదం
  • విశాఖ: ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు
  • విశాఖ: సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన రసాయన వాయువు
    విశాఖ: ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాసలో ఇబ్బందులతో స్థానికుల అవస్థలు
  • విశాఖ: భయాందోళనతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయిన స్థానికులు
  • సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరికలు
  • విశాఖ: పరిసర ప్రాంత ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్న పోలీసులు

06:10 May 07

లీకైన రసాయన వాయువు

విశాఖ ఎల్​జీ పాలిమర్స్​లో గ్యాస్ లీకేజ్
  • విశాఖ: గోపాలపట్నంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో ప్రమాదం
  • విశాఖ: పరిశ్రమ నుంచి లీకై 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన రసాయన వాయువు
  • విశాఖ: చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికుల అవస్థలు

Last Updated : May 7, 2020, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.